ముంబై మహాలక్ష్మీ ఆలయ విశేషాలు ఇవే !

-

మహాలక్ష్మీ దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిలో పేరుగాంచినవి కొన్నిమాత్రమే. వాటిలో ముంబైలోని ప్రసిద్ధ లక్ష్మీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం…


నమస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే అనే రూపం అమ్మ లక్ష్మీదేవిది. సరిగ్గా ఈ రూపంతో ఆలయన్ని ముంబైలో నిర్మించారు. ముంబై నగరం లోని ప్రసిద్ధి చెందిన మహాలక్ష్మి దేవాలయం భూలభాయ్ దేశాయ్ రోడ్డు లో నెలకొని వుంది. మూల విరాట్టు మహాలక్ష్మి దేవి. ఈ ఆలయం 1831లో ధాక్జి దాదాజీ (1760 – 1846) ఒక ప్రముఖ వ్యాపారవేత్త నిర్మించారు. ఈ విశాలమైన ఆలయం ప్రాంగణంలో మహాకాళి,మహాలక్ష్మి, మహాసరస్వతి ఆలయాలు వున్నాయి. దేవి తత్త్వం పరబ్రహ్మ స్వరూపం ఆది శక్తి ఈ దెవి. పరాశక్తి మహా మాయా శక్తి స్వరూపిణి మహాలక్ష్మి మాత. ఈ విశ్వ సృష్టి అంతా ప్రకృతి, పురుషుల సంగమం. పురుషుడు అంటే పరబ్రహ్మ స్వరూపం , ప్రక్రుతి అంటే.. మూడు గుణాలు కలిగి వున్నది ప్రకృతి. అవి సాత్విక, రాజస, తామస, ఇక్కడ వున్న ఈ మూడు మూర్తులు ఈ త్రిగుణాత్మలకి ప్రతీకలు. శ్రీ సరస్వతి సాత్విక గుణానికి, శ్రీ మహాలక్ష్మి రజస్సు కి , శ్రీ మహాకాళీ తామస గుణానికి ప్రతిబింబాలని సంఖ్యా శాస్త్రం లో చెబుతుంది.

అన్నిటికి మించిన ఆ మాహా శక్తి మహా మాయ, ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ ఆ అది పరా శక్తి రూపిణి మహాలక్ష్మి గా ఇక్కడ రూపు దిద్దుకుంది అని భక్తుల విశ్వాసం. కోరిన కోర్కెలు తీర్చే మాత ఈ మహాలక్ష్మి దేవి. నిత్యమూ భక్తులతో కిటకిట లాడే ఈ ఆలయం మహిమ గలదని భక్తుల విశ్వాసం. నవరాత్రులలో దేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులను ముగ్గురు దేవతలకు మూడు రోజుల చొప్పున ప్రత్యెక పూజలు నిర్వహిస్తారు. మొదటి మూడు రోజులు మహా కాళికి, తరువాతి మూడు రోజులు మహాలక్ష్మి దేవికి, చివరి మూడు రోజులు మహా సరస్వతికి విశేష పూజలు జరుగుతాయి.

దూర ప్రదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అమ్మవారికి పూలు పళ్ళు, స్వీట్స్ సమర్పించు కుంటారు. ముంబై లోని మహాలక్ష్మి రైల్వే స్టేషన్ కి సమీపం లో ఒక కిలోమీటరు దూరం లో వుంది ఈ ఆలయం. ఇక్కడ ప్రతి శుక్రవారం, పండుగ దినోత్సవాలలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముంబై పోయినప్పుడు తప్పక ఈ దేవాలయాన్ని దర్శించండి. బాలీవుడ్‌ స్టార్‌లు ఈ దేవాలయాన్ని ఎక్కువగా దర్శిస్తుంటారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news