మద్యాన్ని మాన్పించే శక్తీ నిజంగా దేవుడుకు ఉంటుందా?

-

మద్యం తాగకండి అని ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా కూడా మా పని మాదే అంటూ మందుబాబులు తాగుతున్నారు.తాగడానికి సందర్భం అవసరం లేదు అంటూ ఎప్పుడూ పడితే అప్పుడు తాగేస్తున్నారు.పెగ్గు వేసుకునేందుకు సాకులు ఎన్నో. ఇక మందు కొట్టేందుకు కూర్చోవడం వరకే వారి పరిధిలో ఉంటుంది. ఆ తర్వాత కిక్కుతలకెక్కెంత వరకూ మందు కడుపులోకి దిగాల్సిందే.

మత్తు నోట్లో తలపెట్టి.. బయటికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు కొందరు,మరి కొంత మంది ముందుకు బానిసలుగా ఎందరో బతుకులు ఛిన్నాభిన్నమయ్యాయి. పెళ్లాం మెడలో పుస్తెలు తెంపుకుని తాగినోళ్లు.. పిల్లలను అమ్ముకున్న దౌర్భాగ్యులు.. ఆస్తులు, భూములు అమ్ముకుని రోడ్డున పడ్డ దీనులు.. ఇలా ప్రతి తాగుబోతు వెనుక కథా కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే మత్తు సంకెళ్లను తెంచి.. కొత్త జీవితాన్ని ప్రసాదించే మార్గమూ ఒకటుందని బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లు వాసులు.

మహారాష్ట్రలోని పండరీపురం,ఉంతకల్లులో వెలసిన రుక్మిణీపాండురంగస్వామి ఆలయం అత్యంత మహిమాన్వితంగా ఖ్యాతి గడించింది.భక్తి శ్రద్దలతో ఆ దేవుడిని కొలిస్తె కోరిన కోర్కెలు నెరవేరుతుందని అక్కడి జనాల నమ్మకం.వ్యక్తిలోని చెడు గుణాలను దూరం చేసే దేవదేవుడిగా పాండురంగడిని భక్తులు కొలుస్తుంటారు. ఈ నమ్మకాన్ని రుజువు చేస్తూ.. మద్యానికి బానిసైన వారు ఉంతకల్లులోని రుక్మిణీపాండురంగ స్వామి ఆలయాన్ని దర్శించుకుని మాల ధరిస్తే మళ్లీ మద్యం జోలికి వెళ్లలేదు. ఇంకా ఏదైనా ఉన్న పూర్తిగా తగ్గిపోతుంది అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు..ఇక్కడ ప్రతి ఏకాదశి పర్వదినాన్ని ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తుంటాం. ఆ రోజున స్వామి మాల ధరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మీరు కూడా అక్కడకు వెళ్ళితే మాత్రం ఆ ఆలయాన్ని దర్శించుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news