కలియుగ వైకుంఠం..తిరుమల. సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి జరుగుతున్న ఈ ఉత్సవాలల్లో అత్యంత ముఖ్యమైన సేవ గరుడసేవ. ఈ తొమ్మిది రోజులూ స్వామివారికి ఉదయం, సాయంత్రం జరిగే వాహన సేవలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. శ్రీవారికి జరిగే వాహన సేవల్లో అత్యంత కీలకమైనది గరుడసేవ. అక్టోబర్ 4న ఈ సేవ జరుగనున్నది. స్వామివారి బంగారువాకిలో పలికి వెళ్లిన తర్వాత మూలవిరాట్‌కు ఎదురుగా ఉండే గరుత్మంతుడిని దర్శించే స్వామి దగ్గరకు వెళ్లాలి. అలాంటి సాక్షాత్తు విష్ణురూపమైన శ్రీ వేంకటేశ్వరుడి వాహనమైన గరుత్మంతుడి పై ఈ రోజు వాహన సేవ జరుగనున్నది. శ్రీమహావిష్ణువు, గరుడ సమ్మేళనం, వేదస్వరూప శీర్షాలుగా తెలుస్తుంది. దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, అసనంగా, అవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా గరుత్మంతుడు శ్రీనివాసుడిని సేవిస్తున్నాడు. అంతేకాదు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేదే గరుత్మంతుడే. ధ్వజారోహణలో పతాకంపై గరుత్మంతుడి బొమ్మను వేస్తారు.
విశేషాలు ఇవే!
బ్రహోత్సవాలల్లో గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి ద్రువభేరమైన స్వామికి భేదం లేదని చెప్పడానికే, నిత్యం మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను గరుడ సేవలో అలంకరిస్తారు. గరుడోత్సవంలో స్వామి ఒక్కరే పాల్గొంటారు. ప్రసన్న వదనుడిగా గరుత్మంతుడిపై ఊరేగే శ్రీనివాసుని దర్శించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాడా విశ్వాసం. స్త్రీ పురుషలలో ఎవరు ఎక్కువ, తక్కువ అనే లింగ భేధాలను తన భక్తులు విడనాడాలన్నదే ఇందులోని అంతరార్థం.
ఈ సేవను దర్శిస్తే కలిగే ఫలితాలు ఇవే!
బ్రహ్మోత్సవ వాహన సేవల్లో ఒక్కో సేవను దర్శిస్తే ఒక్కో ఫలితం వస్తుంది. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడవాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గం ప్రాప్తించి, ఇహపరమైన ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి, బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ విశిష్టత సంతరించుకుంది. ఈ సేవను దర్శించడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఇక ఆలస్యమెందుకు ఈరోజు సేవను టీవీల్లోనైనా వీక్షించి స్వామి అనుగ్రహాన్ని పొందండి.
– కేశవ