రథసప్తమి.. సాక్షాత్తు శ్రీ సూర్యనారాయణస్వామి ప్రత్యేకం. ఈ రోజు కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఘనంగా నిర్వహిస్తారు. ఆ స్వామికి సూర్యుడికి ప్రత్యేక అనుబంధం. బ్రహోత్సవాలలో సూర్యప్రభ వాహన సేవ అందరికీ తెలిసిందే. ఆ విశేషాలు తెలుసుకుందాం… ఫిబ్రవరి 1న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో రథసప్తమి వేడుగలు వైభవంగా జరుగుతున్నాయి.
మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తరువాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజును రథసప్తమిగా వేడుకలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీనివాసునికి ఈ రోజున ఏడు వాహనాల సేవలను టిటిడి పాలకమండలి నిర్వహించి తిరుమాడ వీథులలో ఊరేగుతారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి …
ఉదయం 6 గంటలకు సూర్యప్రభ వాహన సేవ
ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనంపై ఊరేగిస్తారు.
ఉదయం 11 గంటలకు గరుడ వాహనంపై ఊరేగిస్తారు
మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనంపై ఊరేగిస్తారు
మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు
మధ్యాహ్నం 4 గంటలకు కల్పవృక్ష వాహనంపై ఊరేగిస్తారు
సాయంత్రం 6 గంటలకు సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారు
సాయంత్రం 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు.
– కేశవ