వాస్తు: అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలు రాకుండా ఉండాలంటే ఇవి పాటించండి..!

వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను కనుక పాటిస్తే తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది. మానసిక సమస్యలు మొదలు ఆర్ధిక సమస్యల వరకూ ఎన్నో వాటికి పరిష్కారం దొరుకుతుంది.

కొన్ని కొన్ని సార్లు మనకి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. దీని వల్ల ఇంట్లో ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఈ చిట్కాలను అనుసరిస్తే తప్పకుండా సమస్య ఉండదు. మరి ఇక వాటి కోసం చూస్తే..

చదువుకునేటప్పుడు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ కూర్చుని చదువుకోవడం వల్ల ఒత్తిడి మరియు పూర్తిగా దూరం అవుతుంది. అదే విధంగా ఇంటి లోపల మొక్కలుని ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మంచి వైబ్రేషన్స్ కూడా వస్తూ ఉంటాయి.

ఒత్తిడి వంటివి కూడా దూరం అయిపోతాయి. అలాగే బెడ్రూంలో లావెండర్ మొక్కని పెట్టుకోవడం వల్ల ఒత్తిడి పూర్తిగా దూరం అయిపోతుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. అలానే మంచాలు కొనేటప్పుడు గుండ్రంగా ఉండే వాటిని తీసుకోవద్దు. దీని వల్ల శాంతి ఉండదు.

వంట గదిలో పొయ్యి ఎప్పుడూ కూడా తూర్పు వైపుకి ఉంచుకోవాలి. అలానే మంచాన్ని బాత్రూం తలుపుని పక్కపక్కన ఉండేలా వుంచద్దు. ఇది నెగిటివిటీకి తీసుకొస్తుంది. కనుక ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉండండి. వీటిని కనుక అనుసరించారంటే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉండవు. దీనితో మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు.