Vastu : పక్షులను మీ ఇంట్లో ఉంచితే ఏం అవుతుందో తెలుసా…?

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి పక్షులకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

 

చాలా మంది ఇళ్లల్లో పక్షులు తాలూకా పిక్చర్స్ ఉంటాయి. అలానే కొందరి ఇళ్లల్లో పక్షలుని కూడా పెంచుకుంటూ వుంటారు. అయితే వాటి వలన మంచి కలుగుతుందా..? లేదా అవి ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి..? ఇలా అనేక విషయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అయితే మరి పక్షుల వలన కలిగే లాభాలు ఏమిటి అనేది కూడా చూసేద్దాం..! వాస్తు శాస్త్రం ప్రకారం పక్షులని ఇంట్లో పెంచితే చాల మంచి కలుగుతుంది అని అంటున్నారు. పక్షులుని ఇళ్లల్లో పెంచుకోవడం వలన కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు.

ఎక్కడైతే పక్షులు ఉంటాయో అక్కడ వాతావరణం అంతా బాగా ఉంటుందట. మీరు కావాలంటే నిజమైన పక్షులు పెంచచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే పక్షుల బొమ్మలు లేదా ఫోటోలు వంటివి కూడా పెట్టుకోవచ్చు. వాల్ పోస్టర్స్ లాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు. వీటి వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివిటీ ఉంటుందని ఆయన చెప్పారు. అలానే మీ పనిలో సక్సెస్ బాగా పెరుగుతుందని కూడా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news