వాస్తు: వంటింట్లో మందులు పెడితే ఈ నష్టాలు తప్పవు..!

తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కొన్ని కొన్ని సార్లు కంగారు వల్లనో లేదు అంటే తెలియకనో మనం సామాన్లని సర్దేస్తు ఉంటాం. అయితే ఇంట్లో మనకు ఇష్టం వచ్చిన చోట అన్నిటినీ సర్దేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం చాలా ముఖ్యం.

అయితే పండితులు ఈరోజు చాలా మంది చేసే తప్పు గురించి వివరించడం జరిగింది. మీరు కనుక దీనిని అనుసరిస్తే ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండొచ్చు అని అంటున్నారు. చాలా మంది తెలిసో తెలియకో మందులని కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని కానీ వంటింట్లో పెడతారు.

మీరు కూడా ఇలానే చేస్తున్నారా..? అయితే ఇది నిజంగా తప్పండి. తప్పకుండా దీన్ని సరి చేసుకోండి. లేదు అంటే అనారోగ్య సమస్యలు మొదలు ఎన్నో సమస్యలు వస్తాయి. ఎక్కువగా వంట గదిలో కాలిపోవడం, చేయి కట్ అయి పోవడం లాంటివి జరుగుతుంటాయి. అందుకనే చాలా మంది వంటగదిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని పెట్టడానికి ప్రిఫర్ చేస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని కానీ మందులను కానీ అస్సలు వంటింట్లో ఉంచకూడదు అని పండితులు అంటున్నారు.

వంట గదిలో ఇలాంటివి పెట్టడం వల్ల ఇంట్లో ఉండే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అప్పుడప్పుడూ ఆరోగ్యం బాగుండడం.. అప్పుడప్పుడూ ఆరోగ్యం బాగోక పోవడం లాంటివి కుటుంబ సభ్యుల్లో చూడచ్చని అందుకని వంట గదిలో ఎప్పుడూ కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ మందులు కానీ పెట్టదు. ఒకవేళ కనుక మీరు ఈ తప్పును సరి చేసుకుంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. లేదు అంటే ఇబ్బందులు తప్పవు.