వాస్తు టిప్స్: ఇంటి గోడలపై ఎలాంటి పోస్టర్లు అతికించకూడదో తెలుసుకోండి..

ఇంట్లో పెట్టుకునే ప్రతీ వస్తువుకి వాస్తు చూస్తున్నారు. ఏ వస్తువు పెట్టుకుంటే ఏ విధంగా ప్రభావం చూపుతుంది? ఎలాంటి పెట్టుకుంటే శుభం కలుగుతాయి అన్న విషయాలు వాస్తు శాస్త్రంలో వివరిస్తున్నారు. మీ ఇంటి గోడలపై ఎలాంటి పోస్టర్లు పెట్టకూడదో, పెడితే ఎలాంటి పరిణామాలు వస్తాయో తెలుసుకోండి.

క్రూర జంతువులు

క్రూర జంతువులైన సింహం, పులి వంటి పోస్టర్లు అతికించవద్దు. లేడిపిల్లను వెంబడిస్తున్న పులి పోస్టర్లు ఉంచవద్దు. దానివల్ల ఇంట్లోని వారిపై నెటిగివ్ ప్రభావం పడుతుంది. ఆలోచనల మీద ప్రభావం చూపి నెగెటివ్ గా మార్చేస్తాయని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

మునిగిపోతున్న పడవ

సినిమాలు బాగా ఇష్టపడే వారు వారి ఇళ్ళల్లో మునిగిపోతున్న టైటానిక్ ఓడ పోస్టర్ ని పెట్టుకుంటారు. ఇది ఎంతమాత్రమూ మంచిది కాదు. మునిగిపోతున్న ఓడ తాలూకూ పోస్టర్లు గోడలపై ఉండరాదు. ఇది మనుషుల నైతికతను బలహీనపరుస్తుంది. అదీగాక దురదృష్టానికి చిహ్నం అని చెబుతుంటారు. ఆర్థిక పరమైన ఇబ్బందులకు ఇది కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

ఇంకా కత్తులు, యుద్ధాలు వంటి వాటికి సంబంధించిన ఏ చిత్రపటమైన గోడల మీద ఉండరాదని అంటున్నారు. ఇవి మనుషుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపి కుటుంబాల మధ్య గొడవలు చెలరేగే అవకాశం ఉందని, నెగెటివిటీని ప్రోత్సహించే ఎలాంటి పోస్టర్ అయినా గోడల మీద ఉంచకూడదని చెబుతున్నారు. ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి ఇది చాలా అవసరం అని వివరిస్తున్నారు.

వాస్తు మీద నమ్మకం ఉన్నవారు మీ ఇంట్లో ఇలాంటి పోస్టర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అనవసరమైన ఇబ్బందులకు దూరంగా ఉండండి.