వాస్తు: లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే వీటిని మరచిపోకండి..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యనైనా తొలగించచ్చు. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే ఎలాంటి సమస్య నుండి అయినా సరే బయటపడొచ్చు. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

మీకు కూడా తరచూ ఆర్థిక సమస్యలు వస్తున్నాయా..? కష్టపడి సంపాదించినప్పటికే డబ్బులు నిలవడం లేదా..? అయితే తప్పకుండా మీరు పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని చూడాలి. వీటిని ఫాలో అయితే ఇక మీకు తిరుగు ఉండదు.

మన ఇంట్లో ఉండే పూజ గది చాలా ముఖ్యమైనది. అది ఎంతో పవిత్రమైన ప్రదేశం. అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండేటట్టు చూసుకోవాలి. అక్కడికి మంచి హృదయాలతో వచ్చి అందరూ కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. మీరు కనుక విజయం సాధించాలన్నా.. ధనవంతులు అవ్వాలనుకున్నా.. పూజ గదిని ఈశాన్యం వైపు ఉంచుకోండి. ఇది చాలా మేలు చేస్తుంది.

అదేవిధంగా మీ పూజ గదిలో శంఖాన్నిపెట్టండి. శంఖాన్ని పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే ఎంతో మంచి కలుగుతుంది. అలాగే పూజ గదిలో కుంకుమపువ్వు పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఇది మంచిగా కనెక్ట్ అయ్యేటట్టు చూస్తుంది.

అదే విధంగా పూజ గదిలో భగవద్గీతని పెట్టుకుంటే కూడా మంచిది ఇది కుటుంబాన్ని బాగా ఉంచుతుంది. ఆర్ధిక ఇబ్బందులని కూడా తొలగిస్తుంది. ఇలా ఈ విధంగా మీరు పూజ గదిలో మార్పులు చేస్తే చక్కటి ఫలితాలు పొందవచ్చు అలానే ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.