Vastu tips for Marriage : 30 దాటినా పెళ్లి అవ్వట్లేదా..? అయితే ఈ 4 వాస్తు చిట్కాలను పాటించండి..!

-

Vastu tips for marriage: ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ 30 దాటినా కొంతమందికి పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతుంటారు. మీకు కూడా 30 దాటిపోయాయా..? పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ వాస్తు చిట్కాలని పాటించాల్సిందే. వాస్తు ప్రకారం వివాహం అవ్వాలంటే ఖచ్చితంగా వీటిని పాటించాలని వాస్తు నిపుణులు అంటున్నారు. త్వరగా పెళ్లి అవ్వాలంటే పడక గది ఎప్పుడూ కూడా ఆగ్నేయం వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే వాస్తు ప్రకారం త్వరగా పెళ్లి అవ్వాలంటే పడకగది పెయింట్లు విషయంలో కూడా కొన్ని నియమాలని పాటించాలి.

ఈ నియమాలను తప్పక పాటించాలి:

  • ఎప్పుడూ కూడా రంగులు సాఫ్ట్ గా ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. పేస్టల్ కలర్స్ వంటి వాటిని వేయించుకుంటే మరీ మంచిది.
  • అలాగే వాస్తు ప్రకారం అద్దం ఎప్పుడూ కూడా ఉత్తరం లేదా తూర్పు వైపు గోడలకు మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి.
  • ఇక మొక్కల విషయానికి వస్తే.. త్వరగా పెళ్లి అవ్వాలనుకుంటే ఇంట్లో ముళ్ళ మొక్కలని నాటకండి.
  • ఇంట్లో ముళ్ళ మొక్కలు నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ఆ మొక్కలు ఉండడం వలన ఇబ్బందులు కలుగుతాయి. ప్రశాంతంగా ఉండలేరు. పైగా వివాహం కూడా ఆలస్యం అవుతుంది.
  • బెడ్ రూమ్ ఎప్పుడూ కూడా కాస్త వెల్తురుతో ఉండేటట్టు చూసుకోవాలి. అలా అని మరీ ఎక్కువ లైట్లతో బాగా బ్రైట్ గా ఉండకూడదు. ఇలా ఈ నియమాలని కనుక మీరు పాటించినట్లయితే కచ్చితంగా వివాహం త్వరగా అవుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. మరి మార్పు చేసి చూడండి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టండి.

Read more RELATED
Recommended to you

Latest news