వాస్తు : ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగడం మంచిదేనా..?

-

ఇంట్లో చెప్పులు వేసుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇంతకు ముందు ఎవరూ చెప్పులను ఇంట్లో వేసుకుని తిరిగే వాళ్లు కాదు.. గుమ్మం దగ్గరే విడిచిపెట్టేవాళ్లు. సంప్రదాయాలను పాటించే చాలా మంది..ఇంట్లో దేవుడి గది, వంటిగదిలో చెప్పులు వేసుకుని తిరగరు. కానీ ఈ మధ్య కాలంలో రకరకాల అనారోగ్య కారణాల వల్ల డాక్టర్లు ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగమని సూచిస్తున్నారు. కానీ ఈ అలవాటు అసలు మంచిదా? కాదా?

వాస్తు శాస్త్రం ప్రకారం.. చెప్పుల్ని ఇంట్లోకి తీసుకెళ్లకూడదని చాలా మంది వాస్తు సిద్ధాంతులు చెబుతున్నారు. గడపకు ఎదురుగా చెప్పులు విప్పకూడదని, డబ్బులుండే బీరువా, వంటగది, పూజ గదిలాంటి పూజనీయమైన చోట్ల వీటితో తిరగవద్దని, పనులు చేయవద్దని అంటారు. కానీ శరీర శాస్త్రం ప్రకారం.. మన పాదాల్లో 72 వేల నాడుల కొసలు ఉన్నాయి. ఎప్పుడూ చెప్పులు, షూస్‌ వేసకుని ఉండటం వల్ల కాళ్లలో సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అలా కాకుండా రోజులో కొంచెం సేపైనా చెప్పులు లేకుండా నడవడం వల్ల ఈ నరాలు ఉత్తేజితం అవుతాయి. వీటిలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలూ చాలా ఉన్నాయి.

పూర్వకాలం ఇళ్లలో ఎక్కువగా మట్టి నేలలు ఉండేవి. దీంతో వాటి వల్ల మన శరీరాలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇళ్లన్నీ సిమెంటువే. మళ్లీ వాటిలో రకరకాల ఫ్లోరింగులు. గ్రానైట్‌, పాలరాయి, టైల్స్‌ ఉంటున్నాయి. ఇవి మరీ నునుపుగా ఉంటున్నాయి. ఫలితంగా ఎక్కువ కాలం ఈ నేలలపై నడిచేప్పటికి పాదాల నొప్పులు, పగుళ్లు లాంటివి వస్తున్నాయి. వానాకాలం, చలి కాలాల్లో అయితే ఈ నున్నటి ఫ్లోర్‌లు చాలా చల్లగా మారుతున్నాయి. ఫలితంగా ఆ నేలపై నడిచే వారి శరీరాల్లో వాత లక్షణాలు పెరుగుతున్నాయి. దీని వల్ల ఒళ్లు నొప్పులు, నిద్రపట్టకపోవడం, నడుం నొప్పి, పాదాల నొప్పులు.. లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇలాంటి వారికి వైద్యులు కూడా ఇప్పుడు ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగమని సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం కచ్చితంగా చెప్పులను వాడుకోవడం ఉత్తమం. అలా కాకుండా అంతా బాగానే ఉంటే గనుక మామూలు పాదాలతో ఇంట్లో, మట్టిలో తిరుగాడటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news