ఎడిట్ నోట్: ఆట మొదలు..!

-

ఏపీ రాజకీయాలు క్లైమాక్స్‌కు వచ్చేశాయి. ఇక నుంచి అసలు ఆట మొదలుకానుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పిల మధ్య పోలిటికల్ గేమ్ షురూ అయింది. ఇంతకాలం ఎత్తుకు పై ఎత్తు అన్నట్లు రెండు పార్టీలు రాజకీయం చేశాయి. అయితే ఇప్పటివరకు 90 శాతం వైసీపీనే సక్సెస్ అయింది. అధికారంలో ఉండటంతో వైసీపీ హవా కొనసాగింది. మధ్యలో అప్పుడప్పుడు మాత్రమే టి‌డి‌పి..వైసీపీకి చెక్ పెట్టగలిగింది.

- Advertisement -

ఏ మాత్రం టి‌డి‌పి..వైసీపీకి పోటీ ఇవ్వలేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో టి‌డి‌పి కాస్త దూకుడుగా రాజకీయం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రాబు అరెస్ట్ అయ్యి రిమాండ్‌కు వెళ్ళడం సంచలనంగా మారింది. రాజకీయంగా వైసీపీ పై చేయి సాధించింది. కానీ ఇదే సమయంలో టి‌డి‌పి వ్యూహాత్మకంగా ముందుకెళుతుంది. బాబు అరెస్ట్ పై పోరాటాలు, వైసీపీ టార్గెట్ గా రాజకీయం హీటెక్కిస్తుంది. అటు బాబుకు మద్ధతు కూడా బాగానే వస్తుంది. కానీ తప్పు చేశారు కాబట్టి బాబు జైలుకు వెళ్లారని చెప్పి వైసీపీ ముందుకెళుతుంది. బాబు అక్రమాలని బయటపెడుతున్నామని చెబుతుంది.

ఇలాంటి తరుణంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్…పోలిటికల్ గేమ్ లో కీ రోల్ పోషించే దిశగా ముందుకెళుతున్నారు. బాబు అరెస్ట్‌ని ఖండిస్తూ..బాబుకు మద్ధతు తెలిపారు. అలాగే తాజాగా బాబుని జైల్లో కలిసొచ్చి..ఇంకా టి‌డి‌పి-జనసేన పొత్తు అధికారికంగా ఉంటుందని ప్రకటించారు. దీంతో అసలు పోలిటికల్ గేమ్ మొదలైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక నుంచి టి‌డి‌పి-జనసేన కలిసి వైసీపీపై పోరాటం చేయనున్నాయి. ఆ రెండు పార్టీలని వైసీపీ నిలువరించడమే టార్గెట్ గా ముందుకెళ్లనుంది. అలాగే ఎన్నికల సమయంలో రెండు పార్టీలు ఏ స్థాయిలో వైసీపీకి పోటీ ఇస్తాయో చూడాలి. ఇదే సమయంలో బి‌జే‌పి పాత్ర ఎలా ఉంటుందనేది క్లారిటీ రావడం లేదు. ఏపీలో బి‌జే‌పికి బలం శూన్యం…కాకపోతే బి‌జే‌పి అధికారంలో ఉండటంతో..ఆ పార్టీ మద్ధతు కోసం ఇటు టి‌డి‌పి, అటు వైసీపీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రం మద్ధతు ఉంటే ఎన్నికల సమయంలో అధికార బలం దక్కుతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో అసలు ఆట ఇప్పటినుంచే మొదలైందని చెప్పవచ్చు. ఈ ఆటలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...