వాస్తు: ఈ మార్పులు చేస్తే సమస్యలు లేకుండా ఉండచ్చు..!

వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అయితే సమస్యల నుండి త్వరగా బయట పడవచ్చు. చాలా మంది ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు వాస్తు ని ఫాలో అయితే కచ్చితంగా ఈ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాల గురించి చూసేద్దాం.

సాధారణంగా మన ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అనారోగ్య సమస్య కానీ కుటుంబ కలహాలు కానీ లేదా వ్యాపారంలో నష్టాలు కానీ ఉంటూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఈ వాస్తు చిట్కాలని పాటిస్తే మంచిదని పండితులు అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో ఎరుపు రంగు ఉంటే చాలా మంచిదని… ఎరుపు రంగు ఉండడం వల్ల అన్ని కలిసి వస్తాయని పండితులు అంటున్నారు.

కాబట్టి దక్షిణ దిశలో ఉండే గచ్చుకి ఎరుపు రంగు మార్బుల్ వంటివి వేయించడం మంచిది. ఒకవేళ కనుక మీరు అలా చేయకూడదు అనుకుంటే మీరు ఏదైనా డిజైన్ వంటివి ఎరుపు రంగుతో వేయించుకోవచ్చు. ఇది కూడా కష్టం అనిపిస్తే ఎరుపు రంగు కార్పెట్ లాంటివి వేసి ఈ బెనిఫిట్ ని పొందొచ్చు. కనుక దక్షిణం వైపు ఎరుపు రంగు ఉండేట్టు చూసుకోండి. ఇలా కనుక మీరు చేశారు అంటే కచ్చితంగా సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. అలాగే ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోతాయి.