ఈ ఒక్క మొక్క చాలు.. వాస్తు దోషాలు, ఆర్ధిక సమస్యలు వుండవు..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ముఖ ద్వారానికి సంబంధించి కొన్ని విషయాలని చెప్పారు. మరి వాటి కోసం చూద్దాం. ఇంట్లో ఇలా చేస్తే వాస్తు దోషాలు కానీ ఆర్ధిక సమస్యలు కానీ ఉండవట. అయితే మరి ఏం చెయ్యాలి అనేది ఇప్పుడే చూసేద్దాం.

చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. అలానే వాస్తు దోషాల వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలని ఫాలో అవ్వాలి.

మామూలుగా మనం ఇళ్లల్లో మొక్కల్ని నాటుతూ ఉంటాము అందమైన మొక్కలని పెంచుతూ ఉంటాము. అయితే వాస్తు దోషాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మీ ఇంటి నుండి తొలగి పోవాలంటే ఇంట్లో క్రాసులా మొక్కని నాటండి.

క్రాసుల మొక్కని ఇంట్లో ఉంచడం వలన ఆర్థిక సమస్యల నుండి బయటపడచ్చని… ఇది పాజిటివ్ ఎనర్జీని కలిగించి నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని పండితులు అంటున్నారు. అలానే క్రాసుల మొక్క ఇంట్లో ఉంటే వాస్తు దోషాల నుండి కూడా బయటపడవచ్చు అని పండితులు అంటున్నారు. మీ ముఖద్వారానికి కుడి వైపున క్రాసుల మొక్క ఉంచండి దీనితో ఈ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి అవుతుంది. ఆఫీసు డెస్క్ మీద కూడా క్రాసుల మొక్కని పెంచుకోవచ్చు ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే ఖచ్చితంగా సమస్యల నుండి బయట పడొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version