వాస్తు: ఈ తప్పులని ఎట్టిపరిస్థితిలోనూ చెయ్యకండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదు. ఈ మధ్య ప్రతి ఒక్కరు వాస్తు ని అనుసరిస్తున్నారు. వాస్తు ని ఫాలో అయితే సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. వాస్తు పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు మరి వాటి కోసం ఎప్పుడూ చూద్దాం.

 

వాస్తు ప్రకారం మన ఇంట్లో పెట్టుకున్న ప్రతి ఒక్కటి కూడా మన యొక్క పర్సనల్ లైఫ్ పైన ఎఫెక్ట్ చేస్తుంది. అందుకనే మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగితే వాస్తు దోషాలు కలుగుతాయి.

ఈ పనులు చేస్తే వాస్తు దోషం పెరిగిపోతుంది:

వాస్తు శాస్త్రం ప్రకారం చీకటిగా ఇంట్లో రాత్రిపూట ఉండకూడదు. చీకటి లేకుండా చూసుకోవాలి. చీకటి లేకుండా చూసుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అవుతుంది.
ఇంట్లో చెత్త చెదారం ఉంటే కూడా నెగటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోండి ఈ తప్పుని అస్సలు చేయొద్దు.
ఇంట్లో ప్రతీ రోజూ బాధ కలిగినా అలసిపోయినట్లు అనిపించినా అది నెగిటివ్ ఎనర్జీ వలనే. ఈ బాధ నుండి బయట పడాలంటే గంటను గాని శంఖాన్ని కానీ ఇంట్లో మ్రోగిస్తూ ఉండండి. ఇది పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్లల్లో అనుసరిస్తే నెగటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇబ్బందులని కూడా తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version