వాస్తు: ఇంట్లో మంచి కలగాలంటే వీటిని మీ ఇళ్లల్లో పెట్టండి..!

వాస్తు ప్రకారం ఫాలో అయితే ఎలాంటి సమస్యనైనా మనం తొలగించుకోవచ్చు. మన ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఆ సమస్యలు లేకుండా ఉండాలంటే వాస్తుని అనుసరించాలి. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు.

 

vasthu1

వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలు గురించి చూద్దాం. ఇంట్లో వీటిని పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని.. ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుందని పండితులు చెప్పారు. మరి ఇంట్లో ఎటువంటి వాటిని ఉంచితే అదృష్టం కలిసి వస్తుంది అనేది చూద్దాం.

డ్రీమ్ క్యాచర్:

చాలామంది ఇళ్లల్లో డ్రీమ్ క్యాచర్ ని పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇవి కేవలం అందం మాత్రమే తీసుకొస్తాయి అనుకుంటే పొరపాటు. ఇది మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లల గదిలో పెడితే ఎంతో మంచిది. అలానే సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి.

వాటర్ ఫౌంటెన్:

ఇంట్లో వాటర్ ఫౌంటెన్ ని పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కాబట్టి ఇంట్లో వాటర్ ఫౌంటెన్ కూడా పెట్టండి. ఇది చక్కటి ఫలితాలను తీసుకువస్తుంది.

క్రిస్టల్స్:

ఇది కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా వంటింట్లో వీటిని పెట్టుకుంటే మంచిది ఇవి క్రియేటివిటీని పెంచుతాయి. అలానే మంచిగా అదృష్టం తీసుకువస్తాయి.

అగరబత్తులు:

ఇంట్లో వెలుగుతున్న అగరబత్తులు పెడితే ఎలాంటి చెడు అయినా కూడా తొలగిస్తాయి. కాబట్టి ఇంట్లో అగరబత్తులుని వెలిగిస్తూ ఉండండి అదేవిధంగా ఇంటి లోపల మొక్కలు, పువ్వులు ఉంటే కూడా చాలా మంచిది. పండ్లు కూడా పాజిటివ్ ఎనర్జీ ని తీసుకు వస్తాయి. కాబట్టి ఇంట్లో వీటిని పెట్టి పాజిటివ్ ఎనర్జీని పెంపొందించెడి నెగిటివ్ ఎనర్జీ కి దూరంగా ఉండండి.