Vastu Tips : ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా..? ఈ వాస్తు నియమాలు పాటిస్తే సెట్‌

-

కొన్నిసార్లు గ్రహాలు మనతో ఫుడ్‌బాల్‌ ఆడుకుంటాయి. అప్పుడు ఎంత కష్టపడినా, ఎంత మంచిగా మాట్లాడినా అంతా ఎదురే వస్తుంది. మీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఎదుటివ్యక్తికి తప్పులానే అనిపిస్తుంది. అది గొడవలకు దారితీస్తుంది. ఇంట్లో కొన్నిసార్లు ఇలానే జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవపడతారు, చీటికి మాటికి తిట్టుకుంటారు..మనస్సాంతి ఉండదు. ఇంటికి రావాలంటనేనే చిరాకేస్తుంది. ఇంట్లో శాంతి లేకపోవడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా కూడా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ గొడవలను ఆపడానికి, మీ ప్రయత్నాలు విజయవంతం కాకపోతే, వాస్తు సవరణలు చేయాల్సిందే. వాస్తు శాస్త్రంలో కొన్నింటిని అనుసరించడం ద్వారా కుటుంబ వివాదాలను ముగించవచ్చు. దీంతో కుటుంబంలో మళ్లీ సంతోషం, శాంతి నెలకొంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంటి వ్యక్తుల మధ్య సంబంధాలు బాలేకపోతే.. మీరు ఇంట్లో తెల్ల చందనం విగ్రహాన్ని ఉంచాలి. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తగ్గి పరస్పర విశ్వాసం పెరుగుతుంది. ఇది కాకుండా ఇంట్లో కదంబ చెట్టు యొక్క చిన్న కొమ్మను ఉంచండి. ఇది ఇంట్లో ఆనందం, శాంతిని కాపాడుతుంది. కదంబ మొక్కను ఉంచడం వల్ల ఆనందం, శాంతి కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

ఉప్పు ఇంటి నుంచి ప్రతికూలతను తొలగించడానికి పరిగణించబడుతుంది. గదిలో ఒక మూలలో రాతి ఉప్పు ముక్క ఉంచండి. ఉప్పు ముక్కను ఈ మూలలో ఒక నెల పాటు ఉంచండి. ఒక నెల తర్వాత దాన్ని తీసి దాని స్థానంలో కొత్త రాతి ఉప్పును ఉంచండి. దీంతో కుటుంబంలో శాంతి నెలకొని కుటుంబ కలహాలు తగ్గుతాయి.

ఇళ్లలో కర్పూరాన్ని పూజలో ఉపయోగిస్తారు. దీని సహాయంతో మీరు ఇంటి వాస్తు దోషాలను తొలగించవచ్చు. మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే రాత్రి పడుకునే ముందు కర్పూరాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఇత్తడి పాత్రలో కాల్చండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొని అసమ్మతి దూరమవుతుంది. అంతే కాకుండా వారంలో ఏ ఒక్కరోజైనా కర్పూరాన్ని వెలిగించి దాని పొగను ఇల్లంతా ఉంచండి. ఇది కూడా ఇంట్లో శాంతిని కలిగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news