పార్టీ పిరాయింపులకు కారణం ఎవరు..? అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

-

పార్టీ పిరాయింపులకు కారణం ఎవరు..? అని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాపాడుకోలేకపోతున్న నాయకులను తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అధిష్టానం అసంతృప్తి నేతలను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు హాస్యస్పందంగా ఉన్నాయని ఎద్దేవా చేసారు.

పార్టీ ఫిరాయింపులు కేవలం ఒక్క తెలంగాణలోనే కాదని.. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం కేసీఆర్ కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాజకీయాలలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక న్యాయం.. అధికారం కోల్పోయాక మరో న్యాయమా..? అని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 7గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. మరికొందరూ కూడా చేరేందుకు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే వారు ఎవ్వరో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news