వాస్తు: బాత్రూంలో ఈ వస్తువులని అస్సలు పెట్టద్దు.. ఆర్థిక సమస్యలే..!

-

వాస్తు ప్రకారం పాటించడం వలన చాలా సమస్యలకు చక్కటి పరిష్కారం కనపడుతుంది. పండితులు ఈ రోజు మనతో కొన్ని వాస్తు చిట్కాలని పంచుకున్నారు. వీటిని కనుక మనం పాటిస్తే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు కానీ ఈ పొరపాట్లు కనుక చేశారంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మరి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఎటువంటి వాటిని పాటించాలి ఎటువంటి వాటిని పాటించకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూం లో ఈ పొరపాట్లు చేయకూడదు ఇలాంటి పొరపాట్లను చేయడం వలన అనవసరంగా ధన నష్టం కలుగుతుంది. బాత్రూంలో ఎప్పుడూ లోహంతో చేసిన వాటిని పెట్టకూడదు దాని వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. నీటి కుళాయి ఆగ్నేయ మూలలో ఉండకూడదు. దీని వలన నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఈ పొరపాటు కూడా చేయకుండా చూసుకోండి. అలానే బాత్రూంలో ఎటువంటి అద్దాలని కూడా పెట్టకూడదు అది కూడా ఆర్థిక ఇబ్బందుల్ని తీసుకువస్తుంది కాబట్టి ఈ పొరపాటు కూడా చేయొద్దు. అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో బాత్రూం ఉండకూడదు.

నైరుతి దిశలో కూడా ఉండకూడదు. ఈ పొరపాట్లను కూడా చేయకుండా చూసుకోండి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్నానం చేసిన ప్రదేశం పవిత్రమైనది. కనుక ఎప్పుడూ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద బాత్రూమ్ ని పెట్టకూడదు దాని వలన సమస్యలు కలుగుతాయి. బాత్రూమ్ ని సర్దేటప్పుడు షాంపూలు సబ్బులు అన్నిటిని ఒకే చోట ఉంచాలి. ఫ్లోర్ కూడా మెరిసే విధంగా ఉంచుకోవాలి ఇలా ఈ విధంగా మీరు పాటించడం వలన సమస్యలు ఏవి ఉండవు లేదంటే అనవసరంగా వాస్తు దోషాలు ఆర్థిక సమస్యలు కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news