డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని.. కూటమి ప్రభుత్వం మరో 15-20 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని సంచలన ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ప్రతిపక్షంలో అంత బలం లేకపోయినప్పటికీ వారి రౌడీయిజం ఏ మాత్రం మారలేదని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అసాంఘిక చర్యలను సహించదు… ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గొంతుకలు కోస్తామనే మాటలు సినిమాల్లోనే బాగుంటాయి… నేను సినిమాల నుంచి వచ్చినవాడినే అని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ చిన్న విషయాన్ని కూడా సహించబోమని వార్నింగ్ ఇచ్చారు.