వాస్తు: ఇంట్లో ఇక్కడ పూజ చెయ్యకూడదు.. సమస్యలు వస్తాయి..!

-

వాస్తు: వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. సమస్యలు అన్నిటికీ కూడా దూరంగా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగి పోతుంది. చాలామంది ఇంట్లో అనేక సమస్యలు ఉంటాయి అయితే ప్రతీ సమస్య నుండి బయట పడడానికి పరిష్కారం ఉంటుంది. వాస్తు ప్రకారం ఈ విధంగా చేస్తే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమై పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇంట్లో ఇబ్బందులు ఏమి కూడా ఉండవు.

పూజ చేసే క్రమంలో చాలా మంది రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు కానీ అలా తప్పులు చేయకూడదు. వాస్తు ప్రకారం పూజ గది ఈ దిశ లో ఉండకూడదు ఇలా ఉండడం వలన సమస్యలు కలుగుతాయి. మెట్ల కింద ఎప్పుడూ పూజ గది ఉండకూడదు మెట్ల కింద చోటు ఉందని చాలా మంది పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు అలా చేయడం మంచిది కాదు. పూజ గదిని మెట్ల కింద పెట్టడం వలన కుటుంబ సభ్యులలో హృదయ సంబంధిత సమస్యలు వస్తాయి అలానే మానసిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ తప్పును చేయకండి.

బాత్రూం దగ్గర కూడా పూజ గది ఉండకూడదు బాత్రూం దగ్గరలో పూజగది ఉంటే కూడా ఇబ్బందులు వస్తాయి ఇంట్లో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వంటివి కలుగుతుంటాయి. వాస్తు ప్రకారం బేస్మెంట్లో కూడా పూజ గదిని పెట్టకూడదు పూజ గది ఎప్పుడు కూడా బాగా వెలుతురు వచ్చి చోట ఉండాలి. బెడ్రూంలో కూడా చాలామంది పూజ మందిరాన్ని పెడుతూ ఉంటారు అది కూడా మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తప్పులను చేయకుండా చూసుకోండి అప్పుడు ఆర్థిక ఇబ్బందులు మొదలు ఏ ఇబ్బంది ఉండకుండా ఆనందంగా ఉండొచ్చు. సమస్యే ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news