ఈ ప్రదేశాల్లోకి చెప్పులు వేసుకుని వెళ్తున్నారా…? అయితే ఈ సమస్యలు తప్పవు…!

Join Our Community
follow manalokam on social media

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చోట్లకి చెప్పుల్ని లేదా షూ ని వేసుకుని వెళ్ళకూడదు అని పండితులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ప్రదేశాల లో చెప్పులు వేసుకు వెళితే మంచిది కాదని వాస్తు దోషం కూడా ఉంటుందని అంటున్నారు. ఒక వేళ కనుక ఈ ప్రదేశాల్లో మీరు కూడా చెప్పులు వదిలేస్తే అప్పుడు మీకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

వంటింట్లోకి చెప్పులతో వెళ్ళకూడదు:

ఎప్పుడూ కూడా వంట గది లోకి చెప్పులు వేసుకో కూడదు. అయితే వంటగదిలో అన్నపూర్ణ ఉంటుందని వంటింట్లో కి చెప్పులు వేసుకోవడం వల్ల కోపం వస్తుందని, కష్టాలు సంభవిస్తాయని అంటుంటారు.

స్టోర్ రూమ్:

స్టోర్ రూమ్ లోకి ఎప్పుడు కూడా చెప్పుల తో వెళ్ళకూడదు. చెప్పుల్ని కానీ షూస్ ని కానీ ఇక్కడకి కూడా వేసుకుని వెళ్ళకండి.

నదిలోకి తీసుకెళ్లకూడదు:

నదిలో స్నానం చేసేటప్పుడు చెప్పులు ధరించి స్నానం చేయకూడదు. చెప్పులు లేకుండా నదిలో స్నానం చేస్తే శాంతి కలుగుతుంది. అలానే ఇబ్బందులు కూడా రావు.

దేవాలయాలు:

దేవాలయాలని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకని ఎప్పుడూ కూడా చెప్పులు లేదా షూ వేసుకుని దేవాలయం లోకి వెళ్ళకూడదు. చెప్పులు లేదా షూ వేసుకోవడం వల్ల దేవుడికి కోపం వస్తుంది అని అంటారు. అలానే డబ్బులు తీస్తున్నప్పుడు బీరువా లాంటివి ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా చెప్పులు వేసుకుని తెరవకూడదు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...