ఇన్‌స్టాగ్రామ్ రీల్ రీమిక్స్ ఫీచర్.. టిక్‌టాక్ తరహాలో..!

Join Our Community
follow manalokam on social media

టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత చాలా మంది టిక్‌టాక్ యూజర్లు బాధ పడ్డారు. షార్ట్ వీడియోలతో చాలా మంది టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయ్యారు. టిక్‌టాక్‌ను బ్యాన్ చేయడంతో వారిలో చాలా నిరాశ ఎదురైంది. అయితే ఇలాంటి తరహాలోనే ఇప్పుడు మళ్లీ ఇన్‌స్టాగ్రామ్ సేవలు అందించబోతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ వీడియోలు తీసుకునే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ రీమిక్స్ ఆన్ రీల్స్ ఫీచర్ ద్వారా షార్ట్ వీడియోలు చేసుకోవచ్చు. ఇందులో సొంత వెర్షన్‌లో వీడియోలు కూడా క్రియేట్ చేసుకుని అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్‌ను టిక్‌టాక్ చివరిదశలో ప్రారంభించింది. బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్ తర్వాత ఇండియాలోనే ఈ ఫీచర్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ప్రారంభ దశలోనే బాగా పాపులర్ అయింది. 15 సెకన్ల నిడివితో వీడియోలు తయారు చేసుకుని.. దానికి తగ్గట్లు సంగీతాన్ని చేర్చుకోవచ్చు. అలాగే ఎడిటింగ్, టైమర్, స్పీడ్, రివైండ్, అలైన్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్
ఇన్‌స్టాగ్రామ్

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తయారు చేసుకోండిలా..
ముందుగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరుచుకోవాలి. అందులో ఎడమ వైపు ఉన్న కెమెరా గుర్తుపై క్లిక్ చేయాలి. అప్పుడు వీడియో, లైవ్, రీల్స్ వంటి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. దీనిలో రీల్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అలా రీల్స్ తయారు చేసుకోవచ్చు. దీని గరిష్ట సమయం 15 సెకన్లు ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లను రికార్డు చేయడానికి పెద్ద వైట్ సర్కిల్ ఐకాన్‌కు ట్యాబ్ చేయాలి. రికార్డింగ్ నిలిపివేయాలని అనుకుంటే పక్కనే వేరే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ యొక్క రీమిక్స్ ఫీచర్‌ను వాడాలనుకుంటే రీల్‌లోని మూడ్ డాట్ మెనుని నొక్కాలి. అప్పుడు రిమిక్స్ దిస్ రీస్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. స్ర్కీన్‌పై అసలు రీల్, కొత్త రీల్స్ వినబడతాయి. వాటిలో ఎదైనా సెలక్ట్ చేసుకుని వీడియో తయారు చేసుకోవచ్చు. ఇందులో ఆడియో సెట్టింగ్, వాయిస్ ఓవర్ కూడా జోడించవచ్చు. కొత్త రీల్స్‌తోపాటు మీరు కోరుకునే రీల్స్‌లను ఇన్‌స్టాగ్రామ్ అందిస్తోంది. యూజర్లు కేవలం యాక్టివ్ రీమిక్సింగ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

గతేడాది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ప్రారంభించినప్పటి నుంచి దీనికి అనేక ఫీచర్లను జోడించింది. రికార్డింగ్ సమయ పరిమితిని 30 సెకన్లకు పెంచడం, రికార్డింగ్ చేసేటప్పుడు రివర్స్ కౌంటింగ్ టైమర్‌ను 10 సెకన్లకు పెంచడం, క్లిప్‌లను కత్తిరించడం, తొలగించడం వంటి ఆప్షన్లను తీసుకొచ్చింది. ఆడియో నవీకరణ, ఆడియో క్లిప్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో పేజీలను సబ్‌స్ర్కైబ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన పాటలేమైనా ఉన్నా వాటిని బ్రౌజ్ చేసుకునే సదుపాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ కల్పిస్తోంది.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...