ఇండ్లలో వినాయకుడి విగ్రహాలను ఏ ప్రదేశంలో ఉంచి పూజ చేయాలంటే..?

-

వినాయక చవితి రోజున సహజంగానే భక్తులందరూ భిన్న ఆకృతులు కలిగిన.. రకరకాల సైజుల్లో ఉన్న.. ఆకర్షణీయమైన రంగులతో దర్శనమిచ్చే గణేషుడి విగ్రహాలను ఇండ్లలో పెట్టి పూజలు చేస్తుంటారు.

వినాయక చవితి రోజున సహజంగానే భక్తులందరూ భిన్న ఆకృతులు కలిగిన.. రకరకాల సైజుల్లో ఉన్న.. ఆకర్షణీయమైన రంగులతో దర్శనమిచ్చే గణేషుడి విగ్రహాలను ఇండ్లలో పెట్టి పూజలు చేస్తుంటారు. అయితే ఎవరైనా సరే.. ఇంట్లో పూజ మందిరం ఉంటే అందులోనే గణేషుడి విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కానీ పూజ మందిరం లేకపోతే వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసమే ఈ వివరాలను తెలియజేస్తున్నాం. వీటిని చదివి ఇండ్లలో వినాయకుడిని ఏ ప్రదేశంలో పెట్టాలో సులభంగా తెలుసుకోవచ్చు. మరి ఆ వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే…

 

ఇండ్లలో గణేషుడి విగ్రహాలను తూర్పు లేదా పడమర దిక్కుల్లో ఉంచి పూజించాలి. అయితే ఇంట్లో ఈశాన్య దిక్కున గణేషుడి విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తే చాలా మంచి ఫలితం దక్కుతుంది. అయితే గణేషుడి విగ్రహాన్ని ఎప్పుడూ దక్షిణ దిక్కున ఉంచి పూజలు చేయరాదు. అయితే ఉత్తరం, తూర్పు దిక్కులను భక్తులు చూస్తూ ఉండేలా వినాయకులను ఉంచి పూజలు చేయవచ్చు.

ఇక వినాయకుడి విగ్రహాలను ఇతర దేవుళ్లకు చెందిన విగ్రహాల వద్ద పెట్టినట్లయితే ఆ విగ్రహాలకు, వినాయకుడి విగ్రహానికి మధ్య కొంచెం ఎక్కువ దూరం ఉండేలా చూసుకోవాలి. అలాగే జంతువులు, జంతు సంబంధ పదార్థాలను వినాయకుడి దగ్గర ఉంచకూడదు. ఈ నిబంధనలతో ఇండ్లలో వినాయకుడి విగ్రహాలను పెట్టుకుని పూజించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news