వినాయ‌క పూజ ట్రెండ్ మారిందిగా…!

-

గ‌ణ‌ప‌తి బొప్పా మోరియా అంటూ పూన‌కాలు ఊగే పండుగ రానే వ‌చ్చింది. సెప్టెంబ‌ర్ 2న వినాయ‌క చ‌వితి పండుగ అంగ‌రంగ వైభ‌వంగా దేశ‌మంతా జ‌రుపుకోనున్నారు. వినాయ‌క చ‌వితి ద‌గ్గ‌ర‌కు వ‌స్తోన్న కొద్ది దేశంలో పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అయితే ఈ పండుగ కోసం రకరకాల ఆకారాల్లో వినాయక విగ్రహాలు రెడీ చేస్తున్నారు విగ్ర‌హాల త‌యారిదారులు. అయితే దేశ వ్యాప్తంగా ఇలా విగ్ర‌హ త‌యారిదారులు వినూత్నంగా రెడీ చేసి సొమ్ము చేసుకోవడం అన‌వాయితీగా వ‌స్తుంది. స్థానిక ప‌రిస్థితులను అనుగుణంగా ఈ విగ్ర‌హాల‌ను త‌యారు చేస్తుంటారు.

అయితే ముఖ్యంగా దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై నగరంలో పూజలు అందుకునే గణపయ్యలను వివిధ ఆకారాల్లో తయారు చేస్తుంటారు విగ్ర‌హ త‌యారీదారులు. స్థానిక ప‌రిస్థితుల‌కు తోడు, లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా వినాయకులను తయారు చేస్తున్నారు. ముంబైలో అత్యంత రద్దీగా ఉండే దేవాలయాల్లో లాల్ బాగ్చా దేవాలయం ఒకటి. అక్కడ ప్రతి ఏడాది భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.

అంతేకాదు.. అక్కడ ఏర్పాటు చేసే వినాయకుడు చాలా కొత్తగా ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంటాడు. అయితే ఇటీవ‌ల దేశంలో ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు చంద్ర‌యాన్ 2 రాకెట్ ప్ర‌యోగం చేశారు. ఈ చంద్ర‌యాన్2 ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డ‌మే కాకుండా, ఏకంగా చంద‌మామ‌పై ఉన్న విశేషాల‌ను ఫోటోలు తీసి పంపుతుంది. చంద్ర‌యాన్ 2 ఆకేష‌న్‌ను పురస్క‌రించుకుని ఈ వినాయక చవితికి చంద్రయాన్ 2 గణపతిని ఏర్పాటు చేశారు.

గణపతి విగ్రహం పైనా ఇద్దరు వ్యోమగాములు .. విగ్రహం తల వెనక భాగంలో చంద్రయాన్ 2 ఉపగ్రహం..విగ్రహానికి వెనుక భాగంలో తెరను ఏర్పాటు చేసి.. చంద్రయాన్ 2 లాంచింగ్ కు సంబంధించిన విషయాలను చూపుతున్నారు. భారత ఖ్యాతిని గ్రహాంతరాలకు వ్యాపింపజేసిన ఇస్రోకు గుర్తుగా ఇలా వినాయకుడిని అక్కడ ప్రదర్శించారు. సో ఇప్పుడు ఈ వినాయ‌క విగ్ర‌హం విశేషంగా ఆక‌ట్టుకోనున్న‌ది.

Read more RELATED
Recommended to you

Latest news