పోతన వినాయక స్తుతి !

వినాయకుడిని ఆరాధించని భక్తులు ఉండరు. సహజకవిగా పేరుగాంచిన పోతన వినాయకుడిని స్తుతించిన పద్యం తెలుసుకుందాం..

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగ సం
పాదికి దోషభేదికి బ్రసన్న వినోదికి విఘ్నవల్లికావి
చ్ఛేదికి మంజువాదికి గణేష జగజ్జన నందవేదికిన్
మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్”
పై పద్యంలో ‘అద్రి సుతాహృదయానురాగ సంపాదికి’ – అని పార్వతీదేవి హృదయానురాగాన్ని పొందినవాడనటం విశేషం. విఘ్నాలు పోగొట్టి, జగజ్జనులకు మొక్కుగొని ఆనందాలిచ్చేవాడు, మూషిక వాహనుడు, ఉండ్రాళ్ళు తినేవాడు అయిన విఘ్ననాయకుని పోతన నుతించాడు.
మనం పై పద్యాన్ని పఠించి వినాయకుడి అనుగ్రహం పొందుదాం.
– శ్రీ