కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (26-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో బుధ‌వారం (26-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 26th august 2020

1. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 63,173 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 24,67,758కి చేరుకుంది. 7,07,026 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కోవిడ్ కేసుల రిక‌వ‌రీ రేటు 76.30 శాతానికి చేరుకుంది.

2. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 14,888 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7,18,711కు చేరుకుంది. 5,22,427 మంది కోలుకున్నారు. 1,72,873 మంది చికిత్స పొందుతున్నారు. 22,794 మంది చ‌నిపోయారు.

3. క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా 8,580 మంది కరోనా బారిన ప‌డ్డారు. మొత్తం కేసుల సంఖ్య 3,00,406కు చేరుకుంది. 5,091 మంది చ‌నిపోయారు. 2,11,688 మంది కోలుకున్నారు. 83,608 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

4. పంజాబ్‌లో 23 మంది ఎమ్మెల్యేలు క‌రోనా బారిన ప‌డ్డారు. మొత్తం 117 మంది ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా సోకింది. శుక్ర‌వారం ఒక్క రోజు అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహించ‌నున్న నేప‌థ్యంలో టెస్టులు చేయ‌గా.. వారికి క‌రోనా సోకిన‌ట్లు నిర్దార‌ణ అయింది.

5. ఏపీలో కొత్త‌గా 10,830 మందికి క‌రోనా సోకింది. 3,82,469 మొత్తం కేసులు ఉన్నాయి. 92,208 మంది చికిత్స పొందుతున్నారు. 2,86,720 మంది కోలుకున్నారు. 3,541 మంది చ‌నిపోయారు.

6. త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,958 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,90,422కు చేరుకుంది. 6,839 మంది చ‌నిపోయారు. 3,38,060 మంది కోలుకున్నారు. 52,362 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

7. ఢిల్లీకి చెందిన ఆస్కార్ మెడికేర్ రూపొందించిన మొట్ట‌మొద‌టి దేశీయ క‌రోనా టెస్ట్ కిట్‌కు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. ఈ కిట్‌ను పాయింట్ ఆఫ్ కేర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీని వ‌ల్ల కేవ‌లం 20 నిమిషాల్లోనే క‌రోనా టెస్టు ఫ‌లితం వ‌స్తుంది.

8. తెలంగాణ‌లో కొత్త‌గా 3018 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,11,688కి చేరుకుంది. 85,223 మంది కోలుకున్నారు. 25,685 మంది చికిత్స పొందుతున్నారు. 780 మంది చ‌నిపోయారు.

9. క‌రోనా నేప‌థ్యంలో ఒడిశా ప్ర‌భుత్వం 1 నుంచి 12వ త‌ర‌గ‌తుల సిల‌బ‌స్ ను 30 శాతం మేర త‌గ్గించింది. 2020-21వ విద్యాసంవ‌త్సరానికి ఈ నిర్ణ‌యం అమ‌ల‌వుతుంది. అన్ని త‌ర‌గ‌తుల పాఠ్యాంశాల‌ను 30 శాతం మేర త‌గ్గించారు.

10. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివ‌ర్సిటీ మాలిక్యులార్ క్లాంప్ పేరిట కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీనికి గాను నిర్వ‌హించిన ప్రి-క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంత‌మ‌య్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news