Vinayaka chavithi 2024: హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి నాడు హిందువులందరూ వినాయకుడిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటారు. భాద్రపద మాసంలో చతుర్థి నుంచి మొదలై అనంత చతుర్దశి తిధి వరకు కొనసాగుతుంది. ఇంటికి వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. నవ రాత్రులు పూజలు చేస్తారు. ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. ప్రతి వీధి లో కూడా వినాయక విగ్రహాన్ని పెట్టి పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో భక్తులు పూజా కార్యక్రమాలు జరుపుతారు.
ఈసారి వినాయక చవితి ఎప్పుడు వచ్చింది..? ఏ సమయంలో విగ్రహ ప్రతిష్టాపన చేయాలి..?
పంచాంగం ప్రకారం చతుర్థి తిథి సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం ఉదయం 12:08 గంటలకు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7 శనివారం మధ్యాహ్నం 02:05 వరకు ఉంటుంది. ఉదయ తిధి ఏడవ తేదీ ఉండడంతో వినాయక చవితిని ఆరోజు జరుపుకోవాలి. ఈ కారణంగా వినాయక చతుర్థిని ఏడవ తేదీన జరుపుకోవాలి. సెప్టెంబర్ 7 నాడు ఉపవాసము ఉండడం చాలా మంచిది. చవితి గడియలు ఉన్న ఆరవ తేదీ సాయంత్రం నుంచి సెప్టెంబర్ 7 మధ్యాహ్నం లోపు విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించుకోవచ్చు.
వినాయక చవితికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
చతుర్థి తిధి ప్రారంభం: సెప్టెంబర్ 6, 2024 మధ్యాహ్నం 03:01
చతుర్థి ముగింపు: సెప్టెంబర్ 7, 2024 సాయంత్రం 5:37
నిషేదించబడిన చంద్రుని దర్శన సమయం 9:30 AM నుంచి 8:45 PM వరకు
వ్యవధి 11 గంటల 15 నిమిషాలు
మధ్యాహ్నం గణేష్ పూజ ముహూర్తం: 11:0 3 నుంచి 1:34 వరకు
వ్యవధి 2:31 నిమిషాలు