హైడ్రా ఆఫీస్ ని కూల్చేయండి – హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

-

గత కొద్దిరోజుల్లోగా గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా చేపట్టిన చర్యలు అక్రమార్కుల గుండెల్లో వనుకు పుట్టిస్తున్నాయి. నగరంలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాళాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) ఆక్రమణదారులపై కొరడా జూలిపిస్తుంది. ఈ హైడ్రాను ప్రారంభించి నెల రోజులు అవుతున్నప్పటికీ.. ప్రస్తుతం దీని చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి.

ఆక్రమణలపైనే చర్యలు ఉంటాయని హైడ్రా అంటుంటే.. దాని ఏర్పాటు లక్ష్యం వేరే అని ప్రధాన పక్షం ఆరోపిస్తుంది. కేవలం బిఆర్ఎస్ నేతల కట్టడాలపైనే ఫోకస్ పెట్టారా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు, ఎఫ్టియల్, బఫర్ జోన్లలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన భవనాలు, ఫామ్ హౌస్ నిర్మాణాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వీటిని ఎప్పుడు కూల్చివేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు.

ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి హరీష్ రావు హైడ్రా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఆఫీస్ కూడా బుద్ధ భవన్ నాలా కింద ఉందని.. అందరికీ ఒకే రూల్ అయితే హైడ్రా ఆఫీస్ ని కూడా కూల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. నెక్లెస్ రోడ్ లోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, ఇతర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయని.. వాటిని కూడా కూలగొడతారా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news