బొజ్జ గనపయ్యను ఆరాధించని వారే ఉండరు. పూర్వకాలం నుంచి సాధారణంగా ఎక్కువమంది వినాయకుడి విగ్రహాన్ని తయారుచేయడానికి ఉపయోగించే బంకమట్టి. దీని వెనుకు రహస్యం తెలుసుకుందాం…
గణేశ పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉపయోగించడం ఎందుకంటే, వాగులు, నదులు, కాలువలు మొదలైన జలాశయాలన్నీ పూడికతో నిండి వుంటాయి. బంకమట్టికోసం ఆయా జలాశయాలలో దిగి, తమకు కావలసినంత మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీగాక మట్టిని తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు ఎప్పుడో చెప్పారు.
పూజానంతరం ఆయా మట్టి విగ్రహాలను నీటిలో కలపడం వల్ల ఆయా పత్రాలలోని ఔషధగుణాలు సంతరించుకుంటుంది. ఇక ఆలస్యమెందుకు పర్యావరణ హితమైన బంకమట్టి విగ్రహాలను ఉపయోగించుకుని పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుదాం. వినాయకుడి ఆశీస్సులను పొందుదాం.
– కేశవ