ఆనాడు ఇందిరా గాంధీని అమ్మ అన్నారు, ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు, నన్ను రేవంత్ అన్న అంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. నేను మీ కుటుంబ సభ్యుడిని ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉండి.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేద్దాం అన్నారు.
ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణలో చంద్రగ్రహణం తొలగిపోయిందన్నారు. ఏ మార్పు కావాలని ఆడబిడ్డలు ఆశీర్వదించారో.. ఆ మార్పు ఇప్పుడు పరేడ్ గ్రౌండ్ లో కనిపిస్తోందని తెలిపారు. ఆడ బిడ్డలు తలచుకుంటే వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధన పెద్ద కష్టం కాదన్నారు. 65లక్షల మంది స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. పాఠశాలల నిర్వహణ, బడి పిల్లలకు కోటి 30లక్షల జతల యూనిఫామ్ కుట్టించే పని మహిళలకే అప్పగించామని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కేటాయించామని తెలిపారు.