కలలో నీళ్లు కనపడితే ఏం అవుతుంది..?

సాధారణంగా మనకు ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. అయితే కలలో నీళ్లు కనిపిస్తే మంచిదా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే పండితులు చెబుతున్న దాని ప్రకారం కల లో నది లాంటిది కనపడితే చాలా మంచిదని అంటున్నారు. దీని కంటే కూడా నదిలో నీళ్ళు కదులుతున్నట్లు కలలో కనపడితే అది మరింత మంచిదని చెబుతున్నారు.

ఇలా కనుక కనపడితే సక్సెస్ కలుగుతుందని మీరు అనుకున్నవి చేయగలరు అని అంటున్నారు. కానీ ఈ సముద్రం కనపడడం వల్ల మంచిది కాదని ఇలా కనపడితే మీరు నోరు స్లిప్ అయ్యే అవకాశం ఉందని దీని వల్ల ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు .

అదే విధంగా కలలో వరద నీళ్లు కనపడటం కూడా మంచిది కాదని చెడు వార్త వింటారు అని అంటున్నారు. మురికి నీళ్లు కూడా కలలో కనపడకూడదు అని దీని వల్ల కూడా మంచి ఫలితం కలగదు అని అంటున్నారు.

ఒకవేళ మంచి నీళ్లు కనబడితే మంచి కలుగుతుందని సక్సెస్ అందుతుందని చెప్తున్నారు. వర్షం నీళ్ళు కనక కనపడితే అది మంచిదని శుభం కి అది సూచన అని అంటున్నారు. వర్షం నీరు కలలో కనపడితే మంచి వార్త వింటారు అని చెప్తున్నారు. అదే నుయ్యి లో నీళ్ళు చూస్తే హఠాత్తుగా మీకు మంచి కలుగుతుందని ఇది కూడా శుభం అని అంటున్నారు.