పితృపక్షాలు అంటే ఏమిటి ?

-

ప్రతీ ఏడాది భాద్రపదమాసంలో వచ్చే కృష్ణపక్షాన్ని పితృపక్షాలు అంటారు. అసలు పితృపక్షాలు అంటే ఏమిటో తెలుసుకుందాం.. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము , కృష్ణపక్షం పితృపదము , అదే మహాలయ పక్షము. మహాలయమంటే – మహాన్ అలయః , మహాన్లయః మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము , పితృదేవతల యందు మనస్సు లీనమగుట , పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట , అని అర్థములు. అమావాస్య అంతరార్థం: ‘‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం. చంద్రుడు , సూర్యుడిలో చేరి , సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు.

భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి. మహాలయ పక్ష ప్రారంభం / సెప్టెంబర్‌ 2నుంచిప్రారంభమవుతున్నాయి. పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి.

– శ్రీ 

Read more RELATED
Recommended to you

Latest news