PSPK 28 : హరీశ్ శంకర్ డైరక్షన్ లో పవన్ క్రేజీ ప్రాజెక్టు..!

-

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్.. ఇలా ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలతో నిండిపోతుంది. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ అంత రచ్చ చేస్తున్నారు మరి. ఒక వైపు పుట్టిన రోజు శుభాకాంక్షలు, మరో వైపు కొత్త సినిమా అప్డేట్స్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ బర్త్ డే గిఫ్ట్ గా వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది ఆ మూవీ టీం. ఆ తర్వాత పవన్, డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్, ఏమ్ రత్నం కాంబినేషన్ లో పిరియాడిక్ డ్రామాగా వస్తున్న 27 వ మూవీ  ఫస్ట్ లుక్ ను క్రిష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ రెండు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ వచ్చేసింది. అది కూడా పవన్ కళ్యాణ్ 28 వ సినిమా గురించి. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సర్ధార్ వల్లభభాయ్ పటేల్‌, సుభాష్ చంద్రబోస్ ఫోటోలున్నాయి. అలాగే ఇట్స్ టైమ్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని కాప్షన్ ఇచ్చారు. అంటే ఈ చిత్రాన్ని సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందనే విషయం స్పష్టమైంది. అయితే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news