తిథి అంటే…. ఏ ప‌ని ఎప్పుడు మొద‌లు పెట్టాలి…?

-

దేశంలో చాలామంది నేటికి ఏ పని ప్రారంభించాలన్న తిథి బాగుందా లేదా అని తెలుసుకుంటారు. అసలు తిథి అంటే ఏమిటి ? దీని గణన ఎలా చేస్తారు తెలుసుకుందాం…

ఖగోళంలో సూర్యునికి, చంద్రునికి మధ్యగల దూరాన్ని బట్టి ఈ తిథి చెప్పబడుతుంది. అంటే తిథి చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. అమావాస్యనాడు చంద్రుడు సూర్యునితో కలిసి ఉంటాడు. అందుకే ఆ రోజున చంద్రుడు మనకు కన్పించడు. అమావాస్య అనియ మరుసటిరోజు నుంచి సూర్యుని నుంచి చంద్రుడు తూర్పువైపునకు కొద్దికొద్దిగా కదులుతూ సూర్యునికి దూరమవుతాడు. మొదటిరోజు దూరాన్ని బట్టి పాడ్యమి, రెండో రోజు విదియ ఇలా… పదిహేను రోజులకు పదిహేను తిథిలు ఉంటాయి.

అమావాస్య తరువాత విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమిలను మంచి తిథులుగా చెప్తారు. ఆయా సందర్భాలు, కార్యాలను బట్టి చవితి, షష్టి, అష్టమి, నవమిలను కూడా ఉపయోగిస్తారు శాస్త్రంలో. కాబట్టి మంచి పనులు చేసేటప్పుడు శ్రీఘంగా చేయండి. వాటికి కేవలం సంకల్ప బలం, దైవకృప ఉంటే సరిపోతుంది. శుభముహూర్తాలు, కొనుగోలు, అమ్మకాలు తదితరాలకు మంచి తిథులను చూసుకోండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version