అది తల్లి ప్రేమంటే.. 27 ఏళ్ల తర్వాత కోమాలో నుంచి బయటికి వచ్చిన మహిళ

-

ఈ విషయాలన్నింటినీ మునీరా కొడుకు ఒమర్.. ఇటీవలే మీడియాతో పంచుకున్నాడు. అయితే.. అతడు తన తల్లి స్టోరీ చెప్పడం వెనుక పెద్ద స్టోరీయే ఉంది. అప్పుడు తన కొడుకును స్కూల్ నుంచి తీసుకువస్తున్నప్పుడు ప్రమాదం జరగగానే మునీరా.. తన కొడుకును గట్టిగా హత్తుకుంది.

27 ఏళ్లు అంటే మామూలు మాటలా? ఓ మహిళ కోమాలో నుంచి 27 ఏళ్ల తరువాత స్పృహలోకి వచ్చింది. ఈ ఘటన అబుదాబిలో చోటు చేసుకున్నది. 1991లో 32 ఏళ్ల మునీరా అనే మహిళ తన కొడుకును స్కూల్ నుంచి తీసుకొని వస్తుండగా.. వాళ్లు వెళ్తున్న వాహనాన్ని స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో మునీరాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కొడుకు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మునీరా మెదడులో రక్తస్రావం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి మునీరా కుటుంబ సభ్యులు తిరగని ఆసుపత్రి లేదు. లండన్‌లో కూడా ఆమెకు చికిత్స అందించారు. అయినా మునీరా కోమాలో నుంచి బయటికి రాలేదు. ఆ తర్వాత జర్మనీలో కూడా చికిత్స అందించారు. అయినా ఫలితం లేదు.. కానీ.. జర్మనీలోని ఆసుపత్రిలో మునీరాకు దీర్ఘకాలంగా ట్రీట్‌మెంట్ ఇస్తుండగా ఒకరోజు అంటే 2018 జూన్‌లో మునీరాలో కదలిక స్టార్ట్ అయింది. వెంటనే ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె కోమా నుంచి త్వరలోనే బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత కొన్ని రోజులకే మునీరా కోమాలో నుంచి బయటికి వచ్చింది.

ఈ విషయాలన్నింటినీ మునీరా కొడుకు ఒమర్.. ఇటీవలే మీడియాతో పంచుకున్నాడు. అయితే.. అతడు తన తల్లి స్టోరీ చెప్పడం వెనుక పెద్ద స్టోరీయే ఉంది. అప్పుడు తన కొడుకును స్కూల్ నుంచి తీసుకువస్తున్నప్పుడు ప్రమాదం జరగగానే మునీరా.. తన కొడుకును గట్టిగా హత్తుకుంది. దీంతో ఒమర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ.. మునీరాకు మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. ఆరోజు జరిగిన విషాద ఘటనను ఒమర్ గుర్తు చేసుకుంటూ… అమ్మ ఏనాడైనా కోలుకుంటుందనే నమ్మకం నాలో ఉండేది. అమ్మ కోసం ఇన్ని రోజులు వేచి చూశాను. దానికి నేనేమీ బాధపడటం లేదు. ఏదైతేనేం.. అమ్మ కోమా నుంచి బయటికి వచ్చింది. అదే మాకు పదివేలు.. అంటూ ముగించాడు ఒమర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version