అయోధ్య రాజు దశరథుడు, ఆయనకు ముగ్గురు భార్యలు. అయినా ఆయనకు సంతానం లేదు. దీంతో దశరథుడు, సంతానం కోసం యాగం చేయ సంకల్పిస్తాడు. ఋష్యశృంగుణ్ణి అయోధ్యకు ఆహ్వానిస్తాడు. మొదట ఆయన అశ్వమేధయాగం చేయిస్తాడు. దశరథునికి సంతానం కావాలి. ఆ విషయాన్ని ధ్యానదృష్టితో యోచించాడు ఋష్యశృంగుడు. రాజుని పిలిచి, చెప్పాడిలా.మహారాజా! నీ కోరిక నెరవేరాలంటే నువ్వు పుత్రకామేష్ఠి చెయ్యాలి. అధర్వణమంత్రాలతో ఆ యాగం నేను నీ చేత చేయిస్తాను. నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది. దానికి సిద్ధంగా ఉండు.మహాప్రసాదం అన్నాడు దశరథుడు. యాగదీక్షకు సిద్ధమయ్యాడు. ఆ యాగంలో తమ హవిర్భాగాలు స్వీకరించేందుకు బయల్దేరుతూ దేవ గంధర్వ సిద్ధులూ, మహర్షులూ దివ్య లోకంలో పరమేష్ఠితో సమావేశమయ్యారు. లోక కంఠకుడైన రావణాసురుడు బాధలను నివారించి తమను రక్షించమని బ్రహ్మసహా అక్కడ ఉన్న వారందరూ పరమాత్ముని కోసం ధ్యానించసాగారు.
సంతతికోసం దశరథుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఇంట మానవునిగా మాధవుణ్ణి జన్మించమని వేడుకుందాం అన్నాడు. పరమాత్ముని కోసం ధ్యానించండి అన్నాడు. బ్రహ్మసహా అక్కడ ఉన్నవారంతా ధ్యానించసాగారు. కాస్సేపటికి గంటలు గణగణమన్నాయి. పూలవాన కురిసింది. సర్వజ్ఞుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నుడై ఇలా పలికాడు వారితో.మీ అభీష్టాన్ని అనుసరించి దుష్ట రావణుణ్ణి పుత్ర బంధు బలగాలసహా హతమారుస్తాను. లోక రక్షణకోసం సత్యసంధుడైన దశరథునికి నా తేజస్సుతో నలుగురు కుమారులుగా అవతరిస్తాను. మీరూ తగు సన్నాహాలు చెయ్యండి. నిర్భయంగా ఉండండి. అని అభయం ఇచ్చాడు నారాయణుడు. అదృశ్యు డయ్యాడు.పరమేశ్వరుని ఆదేశం విన్నారు కదా! త్వరలో మానవునిగా అవతరించనున్న ఆదిదేవు నికి తోడ్పడేందుకు మనమూ తగు సన్నాహాలు చెయ్యాలి. అన్నాడు బ్రహ్మ.చెప్పండి, ఏం చెయ్యమంటారు? అడి గారంతా.గతంలో నేను ఆవలిస్తే మహాపరాక్రమ వంతుడు ఋక్ష (ఎలుగుబంటు) వీరుడు జాంబ వంతుడు జన్మించాడు. మీరు కూడా మీమీ అంశలతో బలిష్టులైన ఋక్ష, వానర వీరులను భూమిపై అసంఖ్యాకంగా సృష్టించండి. అన్నాడు బ్రహ్మ. సరేనన్నారంతా. దశరథుని క్రతువులో హవి ర్భాగాలు స్వీకరించేందుకు అక్కణ్ణుంచి బయ ల్దేరారు.భక్తి శ్రద్ధలతో పవిత్రాహుతులు హోమ గుండంలో వేలుస్తున్నాడు దశరథుడు. మంత్రో చ్చారణ జరుగుతోంది. హోమగుండం మధ్య నుంచి పెనుమంట లేచింది.
ఆకాశాన్ని అంటింది. ఆశ్చర్యపోయి చూడసాగారంతా. మంట మహా రూపు దాల్చింది. పరాక్రమంతుడయిన ఒక వేల్పు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో సువర్ణపాత్ర ఉంది. దశరథుణ్ణి ప్రసన్నంగా చూశాడతను. ఇలా అన్నాడు.దశరథా! నీ యజ్ఞం సఫలమైంది. నేను ప్రజాపతిని! నీ కోరిక తీర్చేందుకు దేవతలు అందజేసిన దివ్యపాయసాన్ని తీసుకుని, వచ్చా నిక్కడకి. స్వీకరించు. దీనివల్ల మహాతేజోవంతు లయిన నలుగురు కుమారులు నీకు జన్మిస్తారు. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు.మహాప్రసాదం అన్నాడు దశరథుడు. పాయసం కలిగిన సువర్ణపాత్రను ఆశ్చర్య ఆనం దాలతో చూడసాగాడు. ఎలా లేచిన మంట అలాగే హోమగుండంలో మటుమాయం అయింది. ప్రజాపతి అదృశ్యమయ్యాడు. సువర్ణపాత్రను శిర స్సుపై పెట్టుకుని ఉప్పొంగిపోయాడు దశరథుడు. భార్యలను రప్పించాడక్కడకి. పాత్రను చూపించి, పాత్రలోని పాయస మహిమను గురించి వారికి తెలియజేశాడు. అందులో సగభాగాన్ని కౌసల్యకు అందజేశాడు.మిగిలిన దానిలో సగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. ఇంకా మిగిలిన దానిలో సగాన్ని కైకకు ఇచ్చి, శేషభాగాన్ని చూశాడు. ఆలోచించాడు. ఆ శేషాన్ని తిరిగి సుమిత్రకు అందజేశాడు. పాయ సాన్ని ఆరగించిన కౌసల్య, సుమిత్ర, కైకలు గర్భ వతుయ్యారు. దశరథుడు దీక్ష విరమించాడు. భార్యలతో నగరానికి చేరుకున్నాడు. పిల్లలకోసం నిరీక్షించసాగాడు. కొంతకాలానికి దశరథుడికి నలుగురు పిల్లలు జన్మించారు. వారే రామలక్ష్మణ, భరతశత్రుఘ్నలు. తెలిసింది కదా దశరథుడితో పుత్రకామెష్టి యాగాన్ని చెయించింది ఋష్యశుంగుడు అని.
– కేశవ
దశరథుడు యజ్ఞం చేస్తున్న ఫొటో వాడగలరు.