శ్రీలక్ష్మీపూజ రోజున కొత్త చీపిరి ఎందుకు కొంటారు ?

 

శ్రీలక్ష్మీదేవిని ఆరాధించేది సంపదలు, శుభాలు కలుగుడానికి ఆరాధిస్తారు. అయితే లక్ష్మీ రావాలంటే అలక్ష్మీ పోవాలి. అంటే చెత్తచెదారం, ఇలా అన్ని పోవాలి. సాధారణంగా దీపావళి కొసం కొన్ని ప్రాంతాలలో కొత్త చీపురు కొంటారు. చీపురును లక్ష్మీగా భావిస్తారు. ఆ చీపురుతో అర్ధరాత్రి ఇల్లు ఊడ్చి ఆ దుమ్మును బయట పడేయాలి అని చెప్తారు. దీనిని అలక్ష్మీని తొలగించడం అంటారు. సాధారణంగా రాత్రికి ఇల్లు ఊడ్చి దుమ్ము బయట పడేయటం ఎప్పుడూ చేయరు. కేవలము ఈ రాత్రికి చేస్తారు. దుమ్మును ఊడ్చుతున్నప్పుడు చాటను చిన్న కర్రతో వాయించి అలక్ష్మీని బయటికి నెట్టేస్తారు.

                                                                                                                                 శ్రీ