కృష్ణుడికి వేణువు ఎందుకు ఇష్టం.. ఎవరు ఇచ్చారు..?

-

హిందూ ధర్మంలో చాలా మంది దేవతలకి ప్రత్యేక శక్తి ఉంటుంది అలానే దేవుళ్ళకి దేవతలకి వారి సొంత సంగీత వాయిద్యాలు కూడా ఉంటాయి. శివుడి చేతిలో డమరుకం సరస్వతి దేవి చేతిలో వీణ ఉంటాయి. అలానే కృష్ణుడి చేతిలో చూసుకున్నట్లయితే వేణువు ఉంటుంది వేణువు లోని మాధుర్యం ఇంత అంతా కాదు. శ్రీకృష్ణుడి కి వేణుని ఎవరిచ్చారు అనేది కూడా చాలా మందికి తెలియదు. విష్ణుమూర్తి భూమి పై జన్మించినప్పుడు వివిధ అవతారాలలో జన్మించారు.

Wives Of Lord Krishna

ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో భూమిపై జన్మించారు. ఒక రోజు శివుడు శ్రీకృష్ణుడి ని కలవాలని అనుకున్నారు. విష్ణువు శివుడు స్నేహం బాగా బలపడడంతో ప్రత్యేక బహుమతి ఇవ్వాలని ఈశ్వరుడు అనుకున్నారు. ఆ వేణువు ని ఇచ్చి పరమశివునికి కానుక అని చెప్పారు. ఎల్లప్పుడూ తనతో పాటుగా ఈ బహుమతిని ఉంచుకోవాలని శివుడు కృష్ణుడితో చెప్పారట.

వేణువు సుస్వరాయనాదం మాత్రమే కాదు మతపరమైన రక్షణకి చిహ్నం అని శివుడు నిర్ణయించారు. దడిచి ఎముకలతో చేసిన వేణువు అది. దడిచి మహర్షి లోక కళ్యాణం కోసం శరీరాన్ని త్యాగం చేశారు మహా శక్తి శరీరంలోని అన్ని ఎముకలని దానం చేశారని చెప్తారు. ఈ ఎముకలతో పినాక, గాండీవ, సారంగా అనే విల్లులని తయారు చేశారు ఆ ఎముకలని చూర్ణం చేసి వేణువుని చేశారు. శివుడు ఆ వేణువుని కృష్ణుడికి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news