బొట్టు ఎందుకు పెట్టుకోవాలి

-

 

 

బొట్టు పెట్టుకోవడం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారం, సాంప్రదాయం. బొట్టు పెట్టుకుని ఉన్న వ్యక్తి యొక్క ముఖవర్చస్సు ముఖంలో కళ వేరు. అసలు బొట్టెందుకు పెట్టుకోవాలి? బొట్టు పెట్టుకుంటేనే హిందువా? ప్రశ్నలు కోకొల్లలు.

సనాతన ధర్మానికి ఆయువుపట్టైన పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడన్నదానికి గుర్తుగా భ్రూమధ్యంలో బొట్టుపెట్టుకుంటారు. పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మడం అంటే, కర్మ ఫలాన్ని, దాన్ని అనుభవించడాన్నీ, దానిని ఇచ్చేవాడొకడున్నాడన్న సత్యాన్ని,  ఇత్యాది విషయాలున్న సనాతన ధర్మాన్ని అవి ప్రతిపాదిస్తున్నవేదాలను నమ్ముతున్నామనీ, ఆ సనాతన ధర్మంలో చరిస్తున్నామనీ గుర్తే బొట్టు పెట్టుకోవడం.

 

ఒక దేశ సార్వభౌమత్వం ఆదేశ పతాకంలో ఆదేశపు చిహ్నంలో ఉన్నట్టే సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వారు వారి ధర్మం యొక్క సార్వభౌమ చిహ్నంగా బొట్టు ధరిస్తారు.సనాతన ధర్మపు సార్వభౌమికం మనిషి పెట్టుకునే బొట్టులోనూ, దేవాలయ ధ్వజస్థంభంలోనూ, ఇత్యాది విషయాల్లో  ఉంది .బొట్టు పెట్టుకోవడమే  నామోషీ అని భావిస్తున్న ప్రస్తుత సమాజం  అదే స్థానంలో వేడి కురుపో, లేక ఏ పురుగో కుట్టి పుండై మచ్చైతే ఏం చేస్తారో మరి?

బొట్టు పెట్టుకోనివాడు సనాతన ధర్మంలో ఉన్నానని చెప్పటానికీ, అందులోని వేదా, వేదాంగ శాస్త్ర పరిజ్ఙానం సంపాదించుకోడానికీ అనర్హుడు. ఒక దేశంలో ఉండి ఆదేశ పతాకాన్ని గౌరవించనివాడితో లెక్క.

 

Read more RELATED
Recommended to you

Latest news