ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో జగన్ కీలక ప్రకటన చేశారు. దివంగత నేత గౌతం రెడ్డికి ఘనమైన నివాళి అర్పించే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూర్ జిల్లా కోసం దివంగత మంత్రి గౌతం రెడ్డి కన్న కలలను సాకారం చేస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ను త్వరగా కంప్లీట్ చేసి ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. నెల్లూర్ జిల్లాలో ఉన్న సంగం బ్యారేజీ పనులను ఆరు వారాల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్కు గౌతం రెడ్డి పేరు పెడుతామని ఆయన అన్నారు. రాష్ట్రానికి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. మా మిత్రుడిగా ఉన్న గౌతం రెడ్డి చనిపోవడం రాష్ట్రానికి, పార్టీకి తీరనిలోటు అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గౌతంను చిరస్థాయిగా గుర్తుంచుకునే విధంగా.. జిల్లా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకునే విధంగా సంగెం ప్రాజెక్ట్ కి ‘‘మేకపాటి గౌతం సంగం ప్రాజెక్ట్’’ పేరును పెడతామని అన్నారు.
అసెంబ్లీలో జగన్ కీలక ప్రకటన.. సంగం బ్యారేజికి గౌతంరెడ్డి పేరు
-