కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారంటీలవల్ల ప్రజలు రోడ్డు మీద పడ్డారని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మార్నింగ్ వాక్ లో భాగంగా ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రవీణ్ కుమార్తో పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
గత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు మేలు చేసిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, తాగునీటి సమస్యలు మెుదలయ్యాయని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘన విజయం కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.