కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిదేనా..?

కొబ్బరికాయలో పువ్వు ఉంటుంది. అది మెత్తగా ఉంటుంది. దీని రుచి ఎంతో తియ్యగా ఉంటుంది. చాలా మంది దాన్ని కొనుక్కుని తింటూ ఉంటారు. సాధారణంగా ఏ చెట్టుకైనా సరే పువ్వులు పూసి ఆ ప్రదేశంలో కాయలు వస్తాయి. కానీ దీనికి మాత్రం అలా కాదు. కొబ్బరికాయ లోపల ఈ పువ్వులు ఉంటాయి. దీని రుచి బాగుంటుంది. కాబట్టి చాలా మంది ఇష్ట పడుతూ ఉంటారు.

అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదా..? కాదా..? దీని వల్ల మంచి లేదా చెడు జరుగుతుంద అనే దాని గురించి పండితులు ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వీటిని చూస్తే ఖచ్చితంగా కొబ్బరి పువ్వు వల్ల ఇబ్బంది వస్తుందా లేదా మంచి కలుగుతుంద అనేది మీకు తెలుస్తుంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చేద్దాం.

ఎప్పుడైనా మనం దేవాలయాల్లో కానీ ఇళ్లల్లో కానీ కొబ్బరి కాయ కొడితే అందులో పువ్వు రావచ్చు. అయితే పువ్వు ఉండడం వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుంద అనే విషయానికి వస్తే… నిజానికి కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకు పువ్వు వస్తే చాలా మంచిదని కొంత మంది పండితులు అంటున్నారు.

ఇలా పువ్వు రావడం వల్ల మంచి జరుగుతుందని పాజిటివ్ ఎనర్జీ కి సంకేతమని చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే అది శుభానికి చిహ్నంగా భావించండి. అంతే కానీ దాని వల్ల చెడు జరుగుతుంది అనుకుంటే పొరపాటు.