ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..ఎల్లుండి నుంచి 9 రోజులు సెలవులు

ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఇంటర్‌ బోర్డు. ఎల్లుండి నుంచి 9 రోజుల పాటు సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఇంటర్‌ బోర్డు. కరోనా మహమ్మారి విజృంభణ, సంక్రాంతి పండుగ నేపథ్యంలో… ఈ నెల 8వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు అంటే ఏకంగా 9 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్‌ ఇంటర్ బోర్డ్.

ఈ సెలవులు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని…. అన్ని జూనియర్ కాలేజీలకు సెలవులు వర్తిస్తాయని పేర్కొంది ఇంటర్మీడియట్ బోర్డ్. అంతేకాదు… శెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తే కాలేజీలపై కఠిన చర్యలుస తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది బోర్డు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇంటర్‌ బోర్డు. అటు పాఠశాలలకు కూడా ఏపీ సర్కార్‌ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో…. ఏపీ వ్యాప్తంగా.. ఇప్పటికే పండుగ జోష్‌ మొదలైంది. కోడి పందాలు, ఎడ్ల పందాలు అంటూ రచ్చ చేస్తున్నారు జనాలు.