తెలంగాణ CS సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తాలతో పాటుగా మరికొందరు అధికారులకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. కరీంనగర్ MP బండి సంజయ్ ఫిర్యాదుపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. DGP మహేందర్ రెడ్డి, CP సత్యనారాయణ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్‌స్పెక్టర్‌కు కమిటీ నోటీసులు జారీ చేసింది.