మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మద్యం విక్రయాలు నిన్నటి వరకు జోరుగా సాగాయి. మద్యం విక్రయాల్లో 4.09 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు జిల్లా ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి తెలిపారు. మేడారం జాతరలో ఈ సారి 24 దుకాణాలు ఏర్పాటు చేశామని, కల్తీ, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టునట్లు వారు తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి మద్యం విక్రయాలు ఎక్కువ జరిగినట్లు అంచనా వేస్తున్నామన్నారు.