ముందు జాగ్రత్తలతో సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరూ సైబర్ నేరాలపైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని తెలిపారు. సైబర్ నేరానికి గురైతే 1930 కి కాల్ చేయాలన్నారు.