
హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి (గ్రీవేన్స్ డే) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వివిధ ప్రాంతాలలో కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరు ఆరోగ్యాంగా ఉండాలనే ఉద్ధేశంతో ఈనెల 10వ తేదీన నిర్వహించాల్సిన ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు.