యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి కంటే ముందే సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీత, కిశోర్, జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు.