బ్రేకింగ్ : టాలీవుడ్ నటి జయసుధకు కరోనా

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను… కరోనా మహమ్మారి అస్సలు వదలడం లేదు. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి చాలా మందికి పైగా… ఇక తాజాగా  టాలీవుడ్ ప్రముఖ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు  జయసుధ కూడా కరోనా సోకింది. ఇవాళ నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా సోకింది. దీంతో నటి జయసుధ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళింది.

ఈ విషయాన్ని స్వయంగా నటి జయసుధ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “గత రెండు రోజుల నుంచి తాను… తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాను. ఈ నేపథ్యంలోనే నేను కరోనా పరీక్షలు చేయించుకున్నాను. అయితే ఈ పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల సూచన మేరకు నేను హోమ్ క్వారంటైన్ లో కి వెళ్లాను. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యలో నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి” అంటూ జయసుధ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news